డా.బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్ర‌వేశాలు! 4 d ago

featured-image

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి 2024-25 విద్యా సంవత్సరానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 50% మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి, లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ వ్య‌వ‌ధి 2 సంవ‌త్స‌రాలు. అభ్య‌ర్ధుల వ‌య‌సు 21 సంవ‌త్స‌రాల నిండి ఉండాలి. గ‌రిష్ట వ‌యోప‌రిమితి లేదు. ఎంపిక ప్ర‌క్రియ అనేది ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD